అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రో ఖన్నా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రో ఖన్నా ?

భారత సంతతికి చెందిన అమెరికన్‌ కాంగ్రెస్‌ (పార్లమెంటు) సభ్యుడు రో ఖన్నా (46) ఎగువ సభ సెనెట్‌కు పోటీ చేయాలనుకుంటున్నానని వెల్లడించగానే, ఆయన భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చునని డెమోక్రటిక్‌ పార్టీలో ఊహగానాలు ఊపందుకున్నాయి.  కాలిఫోర్నియా రాష్ట్రంలోని 17వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రజాప్రతినిధుల సభకు ఎన్నికైన ఖన్నా 2028లో కానీ, ఆ తరవాత కానీ అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో 80 ఏళ్ల జో బైడెన్‌ తిరిగి పోటీ చేయకపోతే, ఖన్నా  డెమాక్రటిక్‌ పార్టీ తరపున ఆ పదవికి పోటీ చేయవచ్చని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు పార్టీ వ్యూహకర్త మార్క్‌ లోంగా బాఫ్‌ చెప్పారు. ఈ విషయమై అంతిమ నిర్ణయం జరగలేదని ఆయన అన్నారు.  2017 నుంచి అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభలో డెమోక్రాట్‌ సభ్యుడిగా ఉన్న  ఖన్నా మాత్రం 2024 ఎన్నికల్లో బైడెన్‌  మళ్లీ పోటీ చేయకపోతే తాను ఆ పదవికి పోటీపడే ప్రసక్తే లేదని గతంలోనే చెప్పారు. బైడెన్‌ మళ్లీ పోటీ చేస్తే తాను తప్పక ఆయనకు మద్దతు ఇస్తానన్నారు. పంజాబ్‌ నుంచి అమెరికా వలస వెళ్లిన హిందూ కుటుంబంలో జన్మించిన రో ఖన్నా అర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా పని చేశారు.

 

 

Tags :