అమెరికాలో భారత సంతతి మహిళ విజయం

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్ నగర పాలక మండలి సభ్యురాలిగా భారత సంతతికి చెందిన 30 ఏళ్ల జననీ రామచంద్రన్ ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన అతి పిన్నవయస్కురాలే కాకుండా ప్రప్రథమ దక్షిణాసియా సంతతి మహిళ కావడం విశేషం. ఈమె ఎల్జీబీటీక్యూ (స్వలింగ, ద్విలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్) వర్గానికి చెందిన వారు. దక్షిణ భారతంలో ఒక చిన్న గ్రామం నుంచి అమెరికాకు వలస వచ్చిన కుటుంబంలో జన్మించిన రామచంద్రన్ స్టాన్ఫర్డ్, కాలిఫోర్నియా, బర్కిలీ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేశారు. వృత్తిరీత్యా ప్రజాహిత వ్యాజ్యాల న్యాయవాది అయిన జననీ లాభాపేక్ష లేని న్యాయ సలహా సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆసియా, పసిఫిక్ ద్వీపాల సంతతివారి వ్యవహారాలను పర్యవేక్షించే కాలిఫోర్నియా కమిషన్లో సభ్యులుగా ఉన్నారు.
Tags :