MKOne Telugu Times Youtube Channel

బైడెన్ విక్టరీ ఫండ్ కమిటీలో భారతీయ అమెరికన్

బైడెన్ విక్టరీ ఫండ్ కమిటీలో భారతీయ అమెరికన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం నిధుల సమీకరణకు ఏర్పాటు చేసిన డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడిగా భారతీయ అమెరికన్‌ దినేష్‌ శాస్త్రి నియమితులయ్యారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ మరోసారి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల కోసం బైడెన్‌ విక్టరీ ఫండ్‌ పేరిట నిధులను సమీకరించేందుకు డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ స్థాయిలో  కమిటీని నియమించింది. బిల్‌క్లింటన్‌ ఎన్నిక సమయంలో ఏర్పాటు చేసిన కమిటీలో కూడా దినేష్‌ సభ్యుడుగా ఉన్నారు. తాజాగా మరోసారి నియమితులైనట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దినేష్‌ శాస్త్రీకి హైదరాబాద్‌లో వివిద కంపెనీలు ఉన్నట్లు సమాచారం.

 

 

Tags :