రూ.60 లక్షలతో అమితాబ్ విగ్రహం: భారతీయ అమెరికన్

బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌పై అభిమానం ప్రేమను ఓ భారతీయ అమెరికన్ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీకి చెందిన రింకు, గోపీసేథ్ వారి ఇంటి ముందు అమితాబ్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అద్దాల పెట్టెలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రముఖ నేత ఆల్బర్స్ జసని ఆవిష్కరించారు. అమితాబ్ నాకు, నా భార్యకు దేవుడితో సమానం. ఆయన సినిమా జీవితమే కాదు. వ్యక్గిత జీవితం నుంచి ఎంతో ప్రేరణ పొందాను. ప్రజలతో ఎలా కలవాలి. వారితో ఎలా మాట్లాడాలనే విషయాలను తెలుసుకన్నారు. ఆయన మిగతా నటుల లాగా కాదు. కిందిస్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చారు అని ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజినీర్ అయిన గోపీ సేథ్ తెలిపారు. రాజస్థాన్‌లో ఈ విగ్రహాన్ని తయారు చేయించి అమెరికాకు తరలించానని, ఇందుకు రూ. 60 లక్షల వరకు ఖర్చయిందని సేత్ తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సుమారు 600 మంది హాజరయ్యారు. టపాసులు పేలుస్తూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.