ఎన్నారై కృష్ణ వావిలాలకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ఎన్నారై కృష్ణ వావిలాలకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ఇండియన్‌ అమెరికన్‌, తెలుగువారైన కృష్ణ వావిలాలకు ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అమెరికాతో ఇండియన్‌ కమ్యూనిటీని అనుసంధానించేందుకు వావిలాల  చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎంఎల్‌కే (మార్టిన్‌ లూథర్‌కింగ్‌) గ్రాండే పరేడ్‌ స్పెషల్‌ అవార్డు దక్కింది. ఎంఎల్‌కే ఫౌండేషన్‌ చైర్మన్‌ చార్లెస్‌ స్టాంప్స్‌ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గాంధీజీ అనుసరించిన అహింసా మార్గంలో నల్లజాతీయుల హక్కుల కోసం అవిరళ కృషి  చేసిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ సవృత్యర్థం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందిస్తున్నారు.

 

 

Tags :