భారతీయ అమెరికన్ కు కీలక బాధ్యతలు

భారతీయ అమెరికన్ కు కీలక  బాధ్యతలు

భారతీయ మూలాలు ఉన్న అమెరికా నౌకా దళాధికారి శాంతి సేఠీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా కీలక బాధ్యతలు చేపట్టారు.  సేఠీ 2010 డిసెంబరు నుంచి 2012 మే నెల వరకు అమెరికన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెస్ట్రాయర్‌ నౌక డికోడర్‌ కమాండరుగా వ్యవహరించారు. ఒక అమెరికన్‌ యుద్ధనౌక అధిపతిగా భారత్‌ను సందర్శించిన తొలి మహిళా కమాండర్‌ కూడా ఈవిడే. 1993లో శాంతి సేఠీ అమెరికా నౌకదళంలో చేరినప్పుడు మహిళాధికారులకు పరిమిత బాధ్యతలే అప్పగించేవారు. తరువాత సంబంధిత చట్టాన్ని తొలగించడంతో ఆమె కమాండర్‌ హోదాకు ఎదిగారు. శాంతి తల్లి లిన్‌ ఎంగెల్‌బర్ట్‌ కెనడాలో పుట్టి అమెరికాకు వలస వచ్చిన పౌరసత్వం తీసుకున్నారు. శాంతి తండ్రి 1960లో భారత్‌ నుంచి అమెరికా వచ్చి స్థిరపడ్డారు.

 

Tags :