భారత సంతతివారికి సాంకేతిక పురస్కారాలు

భారత సంతతివారికి సాంకేతిక పురస్కారాలు

అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించడానికి తోడ్పడిన సాంకేతిక నిపుణులకు ఇచ్చే స్టేట్‌ స్కూప్‌ అవార్డులలో రెండింటిని భారత సంతతివారు చేజిక్కించుకున్నారు. 2022 సంవత్సరానికి ప్రకటించిన 50 స్టేట్‌ స్కూప్‌ అవార్డులలో రెండు కృష్ణ ఎడత్తిల్‌, నిఖిల్‌ దేశ్‌ పాండేలను వరించాయి. కృష్ణ, టెక్సస్‌ రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో ఎంటర్‌ ప్రైజ్‌ సొల్యూషన్‌ సర్వీసెస్‌ విభాగ డైరెక్టర్‌ కాగా, నిఖిల్‌, జార్జియా రాష్ట్ర ప్రధాన డిజిటల్‌ అధికారి. రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయడానికి తోడ్పడే 50 మంది సాంకేతిక అధికారులకు  ఏటా స్కూప్‌ న్యూస్‌ గ్రూప్‌ అవార్డులిస్తుంది.

 

Tags :