కాన్సాస్ సెనేటర్ గా భారత సంతతి మహిళ

కాన్సాస్ సెనేటర్ గా భారత సంతతి మహిళ

అమెరికాలోని కాన్సాన్‌ రాష్ట్ర డిస్ట్రిక్ట్‌ 22 సెనేటర్‌గా డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలు, భారత సంతతి మహిళ ఉషారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ కాలం ఈ  పదవిలో ఉన్న మాన్‌హాటన్‌ సెనేటర్‌ టామ్‌ హాక్‌ గత నెలలో రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఉషా రెడ్డి ఈ పదవిని స్వీకరించారు.  కాగా, ఈ పదవి లభించడం తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని ఉషారెడ్డి తెలిపారు. మాన్‌హాటన్‌ నగర మేయర్‌గా రెండుసార్లు ఉషారెడ్డి పనిచేశారు. 1973లోనే ఉషా రెడ్డి కుటుంబం ఆమె 8 ఏళ్ళ ప్రాయంలోనే అమెరికాకు వలస వెళ్లింది. గత 28 ఏళ్లకు పైగా ఆమె మాన్‌హాటన్‌లో నివసిస్తున్నారు.

 

 

Tags :