టైమ్ స్వ్వేర్ వద్ద ప్రవాస భారతీయుల నిరసన

టైమ్ స్వ్వేర్ వద్ద ప్రవాస భారతీయుల నిరసన

అమెరికాలో రోజురోజుకూ పెరిగిపోతున్న విద్వేష దాడులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. ప్రముఖ టైమ్‌ స్క్వేర్‌ వద్ద గుమిగూడిన వందల మంది ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఇలాంటి లక్ష్యపూరిత నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు బైడెన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నేరాల అడ్డుకట్టకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను సమీక్షించాల్సిన సమయం వచ్చిందని, ప్రవాసుల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.

 

Tags :