ఆర్మీలో బ్రిటీష్ కాలం నాటి పేర్లు, గుర్తులు మార్చే ప్రక్రియ ప్రారంభం

ఆర్మీలో బ్రిటీష్ కాలం నాటి పేర్లు, గుర్తులు మార్చే ప్రక్రియ ప్రారంభం

భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటీస్ కాలం నాటి విధానాల‌కు స్వస్తి పలకాలని డిసైడ్ అయింది. యూనిఫామ్‌ల‌ను, యూనిట్ పేర్లు, రెజిమెంట్లు, స్వాతంత్య్రం పూర్వం నాటి బిల్డింగ్‌ల పేర్ల‌ను కూడా మార్చాలని ఆర్మీ భావిస్తోంది. సిక్కు, గోర్ఖా, జాట్‌, రాజ్‌పుట్ లాంటి సైనిక యూనిట్ల పేర్ల‌ను కూడా మార్చే యోచనలో ఆర్మీ ఉన్నట్లు సమాచారం. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా నిర్వ‌హించే బీటింగ్ రిట్రీట్ లాంటి ఈవెంట్లతోపాటు రోడ్లు, సంస్థ‌లు, పార్క్‌ల‌కు పెట్టిన బ్రిటీష్ క‌మాండ‌ర్ల పేర్లను కూడా తొలగించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక నుంచి ఆర్మీ డే ప‌రేడ్‌ను దేశ రాజ‌ధానిలో కాకుండా ఇతర నగరాల్లో నిర్వహించనున్నారు. అలాగే ఈ ప‌రేడ్‌ను ఇకపై ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 15వ తేదీన నిర్వ‌హిస్తారు. వ‌చ్చే ఏడాది స‌ద‌ర‌న్ క‌మాండ్ ఏరియాలో ఆ ప‌రేడ్‌ను నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి సూచనల మేరకు బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న విధివిధానాలు, వారికి చెందిన పేర్లను మార్చే ప్రక్రియను జనరల్ మనోజ్ పాండే ప్రారంభించారు.

 

Tags :