ఆ సత్తా మనకుంది.. ఒకటి రెండు కంపెనీలు రాకపోతే

ప్రపంచంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సత్తా భారతీయ కంపెనీలకు ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చైనాలో తయారు చేసిన ఏ కార్ల కంపెనీకి ప్రభుత్వం అనుకూలంగా ఉండోదని అన్నారు. అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారతదేశంలో నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. పుణెలో వెహికిల్ క్రాష్ టెస్ట్ చూసిన తర్వాత ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని రకాల అటోమొబైల్ బ్రాండ్లు ఉన్నాయని వాటలో ఒకటి రెండు ఇక్కడ లేకపోతే నష్టమేమీ లేదన్నారు.
అయితే చైనాలో తయారు చేసిన కంపెనీల ఉత్పత్తులను భారత్లో విక్రయించేందుకు వీలులేదని స్పష్టంగా చెప్పాం. ఇక్కడికి రావాలనుకుంటే భారత్లో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీల కంటే భారతదేశం వాహనాల కంపెనీలు ఉత్తమమైన, మెరుగైన వాహనాలను తయారు చేస్తాయని తాను విశ్వాసంతో ఉన్నామని అన్నారు. ట్రక్లు డ్రైవర్లకు ఎయిర్ కండీషన్డ్ క్యాబిన్స్ కల్గివుండాలనే ప్రతిపాదనను ఉపసంహించుకుంటున్నామని అన్నారు. ఇతర దేశాలో డ్రైవర్లకు ఒక నిర్దిష్ట సమయంలో డ్రైవర్లకు వాహన నడిపే సమయం ఉంటుందని, కానీ ఇక్కడ 18 గంటల వరకు వారు డ్రైవ్ చేస్తారని అన్నారు.