వారిని విడుదల చేయండి.. ప్రవాస భారతీయులు డిమాండ్

వారిని విడుదల చేయండి.. ప్రవాస భారతీయులు డిమాండ్

సీఏఏ ఆందోళనల్లో అరెస్టైన 18 మంది విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ప్రవాస భారతీయు ప్రముఖులు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రిపబ్లిక్‌డే సందర్భంగా వీరంతా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో  18 విద్యార్థులను అక్రమంగా నిర్బంధించారని, వీరిపై అన్ని కేసులను పూర్తిగా ఉపసంహరించాలని ప్రకటనలో కోరారు. ఈ 18 మందిలో షర్జీల్‌ ఇమామ్‌ సహా 13 మంది ముస్లింలున్నారు. ప్రకటనకర్తల్లో ఆస్ట్రేలియాలో ఎంపీగా ఎన్నికైన డేవిడ్‌ షోబ్రిడ్జి, ఆమ్నెస్టీకి చెందిన గోవింద్‌ ఆచార్య సహా పలు దేశాలకు చెందిన హక్కుల గ్రూపులు హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌, భారతీయ ముస్లింల అంతర్జాతీయ సమాఖ్య, దలిత్‌ సొలిడిటరీ ఫోరమ్‌ తదితరులున్నాయి.

 

Tags :