MKOne Telugu Times Youtube Channel

టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ షాక్

టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ షాక్

టెక్‌ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారత్‌ భారీ షాక్‌ ఇవ్వనుందా? అంటే అవుననే సంకేతాలు తాజాగా వెలువడ్డాయి. యాంటిట్రస్ట్‌ ఉల్లంఘనపై గూగుల్‌పై భారత్‌ చర్య తీసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మార్కెట్‌లో కంపెనీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న  రెండు కేసుల్లో గూగుల్‌కి ఇటీవల 275 మిలియన్‌ డాలర్ల పెనాల్టీ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు చేశారు. తన మార్కెట్‌ స్థానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులకు పాల్పడుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌ ప్రభుత్వం చర్య తీసుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించారు. గూగుల్‌పై ఇటీవలి జరినామా తీవ్రమైందని, ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. అయితే గూగుల్‌పై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్య తీసుకోబోతోందో వెల్లడించేందుకు మంత్రి నిరాకరించారు. ఈ సమస్య మనకే కాదు భారతదేశంలోని మొత్తం డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థకు ఆందోళన  కలిగిస్తోందన్నారు. దీనిపై ఇప్పటివరకు గూగుల్‌తో ప్రభుత్వం చర్చించ లేదని, ఈ విషయంలో  కోర్టులో ఉంది కనుక ఎలాంటి చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.

 

 

 

Tags :