భారత నేవీలో చేరిన అత్యాధునిక యుద్ధనౌకలు ఐఎన్ఎస్ నిపుణ్, ఐఎన్ఎస్ నిస్తార్

భారత నేవీలో చేరిన అత్యాధునిక యుద్ధనౌకలు ఐఎన్ఎస్ నిపుణ్, ఐఎన్ఎస్ నిస్తార్

అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నిపుణ్, ఐఎన్ఎస్ నిస్తార్.. భారత నావికాదళంలో చేరాయి. కేరళలోని కొచ్చి తీరంలో గురువారం నాడు ఇవి జలప్రవేశం చేశాయి. ఈ కార్యక్రమంలో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ పాల్గొన్నారు. డైవిగ్ సపోర్ట్ వెసల్స్ (డీఎస్‌వీ)లు అయిన ఈ రెండు యుద్ధనైకలు నేవీని మరింత బలోపేతం చేస్తాయని ఆయన చెప్పారు. అలాగే వీటి రాకతో భారత షిప్పింగ్ ఇండస్ట్రీ సత్తా ప్రపంచం మొత్తానికి తెలిసిందని హరికుమార్ చెప్పారు. కొన్నిరోజుల క్రితం కొచ్చిలోనే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా జలప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నౌకల సహాయంతో పలు రకాల ఆపరేషన్స్ చేసే సామర్ధ్యం భారత్‌కు దక్కిందని హరి కుమార్ అన్నారు. గతంలో నిస్తార్‌ను సబ్‌మెరీన్ రెస్క్యూ కోసం ఉపయోగించేవారు. 1971లో నిస్తార్ డైవింగ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టింది. అప్పట్లో పాక్ నేవీ సబ్‌మెరీన్ ఘాజీపై కూడా నిస్తార్ దాడులు చేసింది.

 

Tags :