మరో భారత సంతతి వ్యక్తి హత్య

మరో భారత సంతతి వ్యక్తి హత్య

అమెరికాలో భారత సంతతికి చెందిన  మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. మేరీ ల్యాండ్‌లో సత్నామ్‌ సింగ్‌ హత్యకు గురయ్యాడు. తన ఇంటికి సమీపంలో సౌత్‌ ఓజోన్‌ ఫార్క్‌లో పార్క్‌ చేసిన బ్లాక్‌ జీప్‌ రాంగ్లర్‌ సహారా కారులో ఉండగానే అతణ్ని కాల్చి చంపిన ఘటన ఆందోళన రేపింది. సమీపం నుంచి సాయుధ దుండగుడు అతనిపై కాల్పులు జరపాడని తెలిసింది. ఛాతీ, మెడపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానిక జమైకా హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే సింగ్‌ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

కాల్పులకు కొద్ది సమయానికి ముందు సత్నామ్‌ సింగ్‌ అతని స్నేహితుడి వద్ద నుంచి ఎస్‌యూవీఐ అరుపు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎస్‌యూవీ యజమాని అనుకొని, సత్నామ్‌ సింగ్‌పై కాల్పులు జరిపారా? లేక ఆసలు హంతకుల టార్గెట్‌ ఎవరు? అనే దానిపై డిటెక్టివ్‌లు ఆరా తీసుకున్నారు. సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. స్థానికుడు జోన్‌ కాపెల్లవి సింగ్‌ కారు వైపు నడుస్తుండగానే మరో కారులో వచ్చిన దుండగుడు సింగ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారి పోయాడు. మేరీ ల్యాండ్‌లోని బాల్టిమోర్‌ తెలంగాణ యువకుడు సాయి చరణ్‌ కారులో హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన నమోదు కావడం చర్చకు దారి తీసింది.

 

Tags :