పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ప్రవాస భారతీయురాలు

పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ  ప్రెసిడెంట్‌గా ప్రవాస భారతీయురాలు

అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ప్రవాస తెలుగు మహిళ నీలి బెండపూడి (58) ఎన్నికయ్యారు. 166 ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్రలో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళగానూ ఆమె ఘనత సాధించారు. పెన్సిల్వేనియా స్టేట్‌ బోర్డు ట్రస్టీలు నీలి బెండపూడిని తదుపరి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నకున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన ఆమె 1986లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసి 30 ఏళ్లుగా మార్కెటింగ్‌ విభాగంలో బోధిస్తున్నారు. కన్సాస్‌, ఒహాయో తదితర యూనివర్సిటీల్లో భోధనా రంగంలో ఉన్నత స్థానాల్లో పని చేశారు. ప్రస్తుతం కెంటకీలోని లూయిస్‌ విల్లే యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

Tags :