భారతీయ విద్యార్థి హర్ష్ పటేల్ కు ఫెలోషిప్

భారతీయ విద్యార్థి హర్ష్ పటేల్ కు ఫెలోషిప్

ప్రత్యేక పొరలతో వడబోసే సాంకేతికత (మెంబ్రేన్‌ టెక్నాలజీ)ను ఉయోగించి అధునాతన నీటి శుద్దీకరణపై పరిశోధన చేసిన భారతీయ మూలాలున్న విద్యార్థి హర్ష్  పటేల్‌ను రూ.9.55 లక్షల (11.750 డాలర్లు) ఫెలోషిప్‌ వరించింది. నలుగురు విద్యార్థులను ఈ ఫెలోషిప్‌కు ఎంపికచేయగా, వారిలో హర్ష్‌ పటేల్‌ ఒకరు. అమెరికన్‌ మెంబ్రేన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (ఏఎంటీఏ) ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అధునాతన శుద్దీకరణ రంగంలో కృషి చేస్తున్న మరో సంస్థ ఏటా ఈ ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి. హర్స్‌ పటేల్‌  మిషిగన్‌ యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పీహెచ్‌డీ విద్యార్థిగా, గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా ఉన్నారు. ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు నీటికొరత వంటి ప్రపంచ సమస్యలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని హర్ష్‌ పటేల్‌ ఈ సందర్భంగా తెలిపారు.

 

 

Tags :