భారత అమెరికన్ విద్యార్థికి 2.5 లక్షల డాలర్ల అవార్డు

అమెరికాలో హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డును భారత అమెరికన్ నీల్ మౌద్గల్ (17)దక్కించుకున్నారు. దీనికింద అతడికి 2.5 లక్షల డాలర్లు అందుతాయి. మిషిగన్‌లోని సెలైన్ ప్రాంతానికి చెందిన నీల్ సులువుగా అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించుకొని ఆర్‌ఎన్‌ఏ ఆకృతులను చాలా వేగంగా, విశ్వసనీయంగా అంచనా వేసే ఒక కంప్యూటర్ నమూనాను సిద్ధం చేశారు. దీనివల్ల భవిష్యత్‌లో కొన్ని రకాల వ్యాధుల నిర్ధారణ చాలా సులవవుతుందని అతడు చెప్పారు.
Tags :