MKOne TeluguTimes-Youtube-Channel

అమెరికాలో మరో దిగ్గజ కంపెనీకి సీఈవోగా భారత సంతతి వ్యక్తి

అమెరికాలో మరో దిగ్గజ  కంపెనీకి సీఈవోగా భారత సంతతి వ్యక్తి

అమెరికాకు చెందిన మరో దిగ్గజ బహుళజాతి కంపెనీకి భారత సంతతి వ్యక్తి సారథ్యం వహించనున్నారు. హనీవెల్‌ ఇంటర్నేషనల్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సీఈఓ) విమల్‌ కపూర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న డేరియస్‌ ఆడమ్జిక్‌ స్థానంలో జూన్‌ 1న విమల్‌ కపూర్‌ బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ తెలిపింది. హనీవెల్‌ ఇంటర్నేషనల్‌లో కపూర్‌కు మూడు దశాబ్దాలకు పైగానే అనుభవం ఉంది. కంపెనీలో ఆయన వివిధ కీలక హోదాలో పనిచేశారు. 10 నెలల క్రితమే ఆయన హనీవెల్‌ ప్రెసిడెంట్‌, ముఖ్య ఆపరేటింగ్‌ అధికారిగానూ నియమితులయ్యారు.

 

 

Tags :