అమెరికాతో పోటీగా బ్రిటన్ కూడా.. లక్ష మంది విద్యార్థులకు

అమెరికాతో పోటీగా బ్రిటన్  కూడా..  లక్ష మంది విద్యార్థులకు

విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికాతో పోటీగా బ్రిటన్‌ కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. మార్చి 2022తో ముగిసిన సంవత్సరంలో మన దేశం నుంచి లక్షా 8 వేల మంది విద్యార్థులకు బ్రిటన్‌ వీసాలు జారీ చేసింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే 93 శాతం అధికం. కరోనా మూలంగా 2020 లో బ్రిటన్‌, అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతర్జాతీయ ట్రావెల్‌ను ఈ దేశాలు బ్యాన్‌ చేయడం వల్ల వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వ్యాక్సిన్‌ రావడంతో భారతీయ విద్యార్థులను బ్రిటన్‌ యూనివర్సిటీలు ఆడ్మిషన్లు ఇస్తున్నాయి. అందుకే ఈ సంవత్సరం రికార్డ్‌ స్థాయిలో విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు న్యూఢిల్లీ లోని బ్రిటీష్‌ హై కమిషనర్‌ అధికారి ఒకరు తెలిపారు.

 

Tags :