అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థులది రెండో స్థానం

అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థులది రెండో స్థానం

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు ఇంజినీరింగు విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొన్నొళ్లుగా ఇదే తీరు కనిపిస్తోంది. అమెరికాలో చేరేవారికి సంబంధించిన గణాంకాలను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే 2020-21 విద్యా సంవత్సరంలో సుమారు 15 శాతం మంది విద్యార్థులు తగ్గారు. 2019`20లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,94,124 మంది చేరితే, 2020`21లో ఆ సంఖ్య 1,67,582కు తగ్గింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికులు చదువుకుంటున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో 1,32,758 ఇక్కడే ఉన్నారు. రెండో స్థానంలో న్యూయార్క్‌ నిలువగా ఇక్కడ 1,06,894 మంది విద్యార్థులు ఉంటున్నట్లు తేలింది. తర్వాతి స్థానంలో టెక్సాస్‌, మసాచుసెట్స్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఒహియో, మిచిగాన్‌ రాష్ట్రాలున్నాయి.

అతితక్కువగా ఇండియానా రాష్ట్రంలో 23,948 మంది చదువుతున్నారు. విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో 17,050 మంది చేరారు. బోస్టన్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయం, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నాయా, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ ఇలా మరో 15 విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యమిస్తున్నారు. అతి తక్కువగా ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ 6,655 మంది చేరారు.

అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు ఇంజినీరింగ్‌ కోర్సుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంజినీరింగ్‌లో 1,90,590 మంది చేరారు. గణితశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులున్నాయి. వీటిలో 1,82,106 మంది చేశారు. ఇక వీటీ తర్వాత బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, సామాజికశాస్త్రాలు, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్స్‌స్‌, ఫైన్‌ అండ్‌ అఫ్లైడ్‌ ఆర్ట్స్‌, ఆరోగ్య వృత్తులు, కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఎడ్యుకేషన్‌, ఇంటెన్సివ్‌ ఇంగ్లిష్‌ కోర్సుల్లో చేరినట్లు తెలిసింది.

 

Tags :