అమెరికాలో ఉన్నత చదువులకు... తెలుగు విద్యార్థులు ఆసక్తి

అమెరికాలో ఉన్నత చదువులకు... తెలుగు విద్యార్థులు ఆసక్తి

అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలో చదువుకోవాలనుకునే యవుతకు మార్గదర్శనం చేయడానికి అమెరికా చెందిన విద్యా సాంస్కృతిక వ్యవహారల విభాగం ఆగస్టు 27న గ్రాడ్యుయేట్‍ వర్చువల్‍ ఎడ్యుకేషన్‍ ఫెయిర్‍ నిర్వహించింది. ఈ ఫెయిర్‍లో 6 వేల మంది పాల్గొంటే వారిలో 1,962 మంది అంటే 32 శాతం విద్యార్థులు తెలంగాణ, ఆంధప్రదేశ్‍, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారే. గతేడాదితో పోలిస్తే ఇది 44 శాతం అధికం. ఈ సందర్భంగా అమెరికా కాన్సులేట్‍ జనరల్‍ జోయల్‍ రీఫ్‍మన్‍ మాట్లాడుతూ అమెరికాలో ఉన్నత చదువులపై ఆసక్తి చూపించిన వారిలో ఎక్కువమంది హైదరాబాద్‍ నుంచే ఉన్నారని తెలిపారు. ఈ ఫెయిర్‍లో అమెరికాకు చెందిన 101 విద్యా సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో కొలరాడో స్టేట్‍ యూనివర్సిటీ, ఫోర్లిడా ఇంటర్నేషనల్‍ యూనివర్సిటీ, పిట్స్బర్గ్ యూనివర్సిటీ లాంటి పలు ప్రముఖ సంస్థలూ ఉన్నాయి. విద్యార్థులు ఈ విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. స్టూడెంట్‍ వీసా పక్రియ గురించి అమెరికా దౌత్య కార్యాలయం అధికారులు విద్యార్థులు వివరించారు.

 

Tags :