అమెరికాలో భారతీయులే అగ్రస్థానం

అమెరికాలో భారతీయులే అగ్రస్థానం

అమెరికాలో ఉన్న అమెరికన్ల కంటే కూడా అక్కడ స్థిరపడిన భారతీయులే అత్యధికంగా సంపాదిస్తున్నారు. అమెరికా జనాభా లెక్కల బ్యూరో 2013-15 మధ్యలో చేసిన సర్వే ప్రకారం భారత సంతతి అమెరికన్ల సగటు వేతనం రూ.82 లక్షలకు పైమాటే. శ్రీలంక, జపాన్‌, చైనా, పాకిస్థాన్‌ వంటి దేశాల నుంచి వచ్చి స్థిరపడిన పౌరుల కంటే ఇది  చాలా ఎక్కువ. కేవలం సంపాదనలోనే కాక, విద్యలోనూ భారతీయులు ముందంజలోనే ఉన్నారు. భారత సంతతిలో 70 శాతం మంది పట్టభద్రులే. డిగ్రీ విషయంలో మొత్తం అమెరికా సగటు 28 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2021లో ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన సర్వే ప్రకారం భారతీయులు సంపదలో, కళాశాలలో విద్యలో అమెరికా జనాభా కంటే ఎంతో ముందంజలో ఉన్నారు. 

 

 

Tags :