అమెరికాలో అత్యధికంగా సంపాదించేది భారతీయులే!

అమెరికాలో అత్యధికంగా సంపాదించేది భారతీయులే!

అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా సంపాదించే కమ్యూనిటీ ఏదైనా ఉందంటే.. అది భారతీయ అమెరికన్లేనట. ఈ విషయాన్ని యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో రిచ్ మెక్‌కార్నిక్ తాజాగా వెల్లడించారు.చైనా, జపాన్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి అమెరికా వచ్చిన వారితో పోలిస్తే.. భారతీయులే అత్యధిక సంపాదనపరులని మెక్‌కార్నిక్ తెలిపారు. 2013-15 యూఎస్ సెన్సస్ బ్యూరో లెక్కల ప్రకారం చూసుకుంటే.. అమెరికాలోని భారతీయ కుటుంబాల సగటు ఆదాయం లక్ష డాలర్లపైగానే ఉంది. అలాగే. భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో 70 శాతం మందికి అమెరికా కాలేజ్ డిగ్రీలు ఉన్నాయి.అసలు మొత్తం అమెరికాలోనే అక్షరాస్యత సగటు 28 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఈ లెక్కలు పాతవి అనుకుంటే.. 2021లో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన లెక్కలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. పీటీఐ లెక్కల ప్రకారం అమెరికాలోని భారతీయ కుటుంబాల సగటు ఆదాయం 1023 లక్షల డాలర్లు. అలాగే 79 శాతం మంది భారతీయ అమెరికన్లు కాలేజ్ గ్రాడ్యుయేట్లు. ఇటీవలి కాలంలో అమెరికాలో ఆసియన్ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

Tags :