గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ నుంచి మరో వ్యాక్సిన్

గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ నుంచి మరో వ్యాక్సిన్

భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన నాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్ల దాటిన వారికి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే అత్యవసర పరిస్థితిల్లో పెద్దవారికి ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతిచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ తెలిపారు. కోవిడ్‌-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఇది పెద్ద ప్రోత్సాహమని డాక్టర్‌ మాండవ్య అన్నారు. 18 ఏళ్లు దాటిన వారికి నాసల్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించిందని తెలిపారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు ఇది పెద్ద ప్రోత్సాహం అని మంత్రి పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.