కూళంగల్ కు మరో అరుదైన గౌరవం

ఆస్కార్ పురస్కారాలను ఇండియా తరపున ఎంపికైన తమిళ చిత్రం కూళంగల్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.. న్యూయార్కర్స్ లిస్ట్ ఆఫ్ బెస్ట్ ఫిల్మ్స్-2021 జాబితాలో కూళంగల్ చోటు దక్కించుకుంది. నయనతార, విఘ్నేష్ శివన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా వినోద్ రాజ్ పీ.ఎస్.కు ఇది తొలి చిత్రం. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సినిమా సాగుతుంది. తాగుబోతు భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆమెను తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు ఆ తండ్రి కొడుకులు పడేకష్టాన్ని మనసుకు హత్తుకునేలా దర్శకుడు తెరకెక్కించారు.
Tags :