అంతుచిక్కని వింత వ్యాధి... ఇప్పటికే 48 మంది

అంతుచిక్కని  వింత వ్యాధి... ఇప్పటికే 48 మంది

కెనడాలో అంతుచిక్కని వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. బ్రన్‌స్విక్‌ ప్రావిన్స్‌లో వెలుగుచూసిన ఈ సంఘటనలో ఇప్పటికే ఈ వ్యాధితో ఆరుగురు మరణించారు. కారణం తెలియని బ్రెయిన్‌ డిసీజ్‌తో పదుల సంఖ్యలో ప్రజలు అనారోగ్యబారీన పడుతున్నారు. 48 మంది ఇప్పటికే ఈ వ్యాధీ బారీనపడ్డట్టు సమాచారం. వీరంతా మతిమరుపు, తికమకపడటం వంటి వ్యాధి తాలూకు లక్షణాలతో హాస్పిటల్లలో చేరుతున్నారని తెలిసింది. ఈ గుర్తుతెలియని వ్యాధికి గల కారణాలు డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. తాజా నివేదికల ప్రకారం మరణించిన వారందరూ 18 నుంచి 85 యేళ్ల మధ్య వయసు వారు. మరణించిన వారంతా మానసిక వ్యాధితో మృతి చెందినట్లు నివేదికలో చెప్పబడిరది. ఈ వ్యాధి బారీన పడ్డవారిలో ఉద్రేకం, మైకం, భ్రమలు, మతిమరుపు, కండరాల నొప్పుల అధిక స్థాయిలో పెరిగినట్టు గుర్తించారు. అక్కడి అధికారులు దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నారు.

 

Tags :