బ్యాంకింగ్, ఆర్ధిక సేవలు, బీమా రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు

బ్యాంకింగ్, ఆర్ధిక సేవలు, బీమా రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు

స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ బీమా సంస్థ స్విస్‌ రీ ఆగస్టు నెలలో హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు లో మంత్రి కేటీఆర్ తో స్విస్‌ రీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్టి భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. 160 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన స్విస్‌ రీ భీమా సంస్థ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా 80 స్థానాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.

 

Click here for Photogallery

 

 

Tags :