పాలమూరు వాసికి అంతర్జాతీయ పురస్కారం

పాలమూరు వాసికి అంతర్జాతీయ పురస్కారం

ఎయిడ్స్‌ బాధితులకు సులభతర చికిత్సపై పరిశోధన చేసిన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి వంశీకృష్ణ జోగిరాజుకు అంతర్జాతీయ యువ శాస్త్రవేత్త పురస్కారం లభించింది. కెనడాలోని మాంట్రియల్‌లో జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు 24వ అంతర్జాతీయ ఎయిడ్స్‌ సదస్సు నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన 10 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 2100 పరిశోధనలకు ప్రెజెంట్‌ చేయగా అందులో క్లినికల్‌ సైన్స్‌ విభాగంలో వంశీకృష్ణకు యువశాస్త్రవేత్త అవార్డు దక్కింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌కు చెందిన శ్రీనివాసరావు, రమాదేవి దంపతుల కుమారుడైన డాక్టర్‌ వంశీకృష్ణ అమెరికాలోని గిలీడ్‌ సైన్సెస్‌లో వైరాలజీ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

 

Tags :