ఆద్యకళ బృందానికి అరుదైన గౌరవం

ఆదివాసీ, గిరిజన, సంస్కృతి, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను సేకరించి వాటిని జనబాహుళ్యంలోకి తీసుకువస్తున్న ఆద్యకళ బృందానికి అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌లోని నాంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ వేదికగా భారత్-ఆఫ్రికా-మానవీయ శాస్త్రాల సంభాషణ, అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. ఇండో-యూరోపియన్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో డిసెంబరు 13-16 తేదీల్లో జరిగే ఈ సదస్సులో తాము పాల్గొంటున్నామని ఆధ్యకళ నిర్వాహకులు ఆచార్య జయధీర్ తిరుమల రావు, ఆచార్య గూడూరు మనోజ తెలిపారు. ఆద్యకళ ప్రదర్శనలోని వస్తు సంస్కృతి, ముఖ్యంగా భారతీయ, తెలంగాణ ఆదివాసీ, గిరిజన, జానపద, సంచార సమూహాల సంగీత వాయిద్యాలు, లోహకళలు, రాతపత్రులు, పనిముట్లు తదితర విశేషాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తామని వెల్లడిరచారు. ఈ పర్యటనలో భాగంగా డిసెంబరు 6న పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సాంస్కృతిక రాయబారి విశాల్ వి. శర్మతో సమావేశం కానున్నమని ఆద్యకళ ప్రతినిధులు తెలిపారు.