మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం

జూలై 5న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు హజరు కావాలని కోరుతూ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన నిర్వహకులు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని ఆహ్వానించారు. గచ్చిబౌలిలోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి ఆహ్వానం పలికిన వారిలో ట్రస్టు బోర్డు చైర్మన్‌ సాయిబాబా, ఇతర సభ్యులు ఆలయ ఈవో అన్నపూర్ణ, అర్చకులు, తదితరులు ఉన్నారు. జులై 4న ఎదుర్కోళ్లు,  5న అమ్మవారి కల్యాణం, 6న రథోత్సవం జరుగనుంది.

 

Tags :