ఏపీలో ఐపీఎస్ ల బదిలీ

ఏపీలో ఐపీఎస్ ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఎస్పీగా సిద్థార్థ్‌ కౌశల్‌ను నియమించింది. కృష్ణా జిల్లా ఎస్పీగా పి.జాషువా, విజయవాడ నగరం శాంతిభద్రతల విభాగం డీసీపీగా విశాల్‌ గున్నీకి బాధ్యతలు అప్పగించింది. కోనసీమకు కొత్త ఎస్పీగా సుధీర్‌ కుమార్‌ రెడ్డిని, మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎస్‌ఎస్వీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

 

Tags :