హైదరాబాద్ ఈడీకి కొత్తబాస్

హైదరాబాద్ ఈడీకి కొత్తబాస్

తెలంగాణలో వరుసగా ఈడీ (ఎన్‌ఫోర్‌సమెంట్‌ డైరెక్టరేట్‌) దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ హైదరాబాద్‌ విభాగానికి కేంద్ర ప్రభుత్వం కొత్త అధికారిని నియమించింది. తెలుగు రాష్ట్రాలపై పట్టున్న పవర్‌ఫుల్‌ అధికారిని డైరెక్టర్‌గా నియమించింది. కొత్తగా దినేష్‌ పరుచూరిని హైదరాబాద్‌ ఈడీ అడిషనల్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ జోన్‌ జేడీని కేంద్రం ముంబైకి బదిలీ చేసింది. ముంబై జోన్‌ ఈడీ యోగేష్‌ శర్మను హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది. 2009 ఐఆర్‌ఎస్‌ కేడర్‌ అధికారి అయిన దినేష్‌కు తెలుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆంద్రప్రదేశ్‌, తెలంగాణలో ఆయన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారిగా పనిచేశారు.  గతంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆదాయపు పన్ను శాఖ రీజినల్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. దినేష్‌ రాకతో కొత్త స్కాంలు బయటకు వస్తాయనే ప్రచారం కొనసాగుతోంది.

 

Tags :