26న హైదరాబాద్ కు ప్రధాని మోడీ

26న హైదరాబాద్ కు ప్రధాని మోడీ

ఈనెల 26వతేదీన హైదరాబాద్‌ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రానున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ లో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. అయితే అధికారక కార్యక్రమానికే ప్రధాని మోడీ వస్తున్నా.. ఆయన పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలంగాణ బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. ఇటీవలనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చి వెళ్ళిన తరువాత ప్రధాని హైదరాబాద్‌ రావడం విశేషం.

 

Tags :