భారత్‌పై దాడులు చేస్తాం : ఐఎస్

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ భారత్‌పై ఉగ్రదాడి చేస్తామని ఇస్లామిక్ స్టేట్ బోరసాన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) హెచ్చరించింది. త్వరలోనే భారత్‌లోని హిందువులు టార్గెట్‌గా దాడి చేస్తామని ప్రకటించింది. అటు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం భారత్‌తో సత్సంబంధాలు పెట్టుకోవటం పైనా ఐఎస్కేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇంతకుముందు అల్‌ఖైదా కూడా భారత్‌లో ఉగ్రదాడులు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో ముస్లింల ఇళ్లను బులోడోజర్లతో కూల్చివేస్తున్నారని పేర్కొంది. అఫ్ఘానిస్థాన్ కేంద్రంగా పనిచేఏ ఐఎస్కేపీ అఫ్ఘాన్, పాకిస్థాన్, తజకిస్థాన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్ర కార్యాకలాపాలు నిర్వహిస్తోంది.
Tags :