ఈ దాడి మేమే చేశాం..

ఈ దాడి మేమే చేశాం..

మహమ్మద్‌ ప్రవక్తపై భారత్‌లో బీజేపీ నేతలు చేసిన విద్వేష వ్యాఖ్యలకు ధీటైన స్పందనగానే అఫ్గానిస్థాన్‌లో గురుద్వారాపై దాడి చేశామని  ఐసిస్‌ ఉగ్ర సంస్థ ప్రకటించింది. కాబూల్‌లోని కార్తే పర్వాన్‌ గురుద్వారాపై జరిగిన బాంబు పేలుళ్లలో ఒక సిక్కు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ప్రవక్తపై విద్వేష వ్యాఖ్యలకు ప్రతీకారంగా ఈ దాడి తామే చేశామని ఐసి అనుబంధ ఇస్లామిక్‌ స్టేట్‌ `ఖొరసాన్‌ ఫ్రావిన్స్‌ (ఐఎస్‌కేపీ) ప్రకటించింది. గురుద్వారాపై దాడి నేపథ్యంలో అక్కడి సిక్కులు హిందువుల భద్రతపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వారిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు సిద్దమైంది. అక్కడి వందకుపైగా సిక్కులు, హిందువులకు ఈ వీసాలను మంజూరు  చేసింది.

 

Tags :