ఇజ్రాయెల్ పరిశోధకుల ఘనత.. ప్రపంచంలోనే తొలిసారిగా

ఇజ్రాయెల్ పరిశోధకుల ఘనత.. ప్రపంచంలోనే తొలిసారిగా

ప్రపంచంలోనే తొలిసారిగా వీర్యకణాలతో పనిలేకుండా సింథటిక్‌ పిండాన్ని ఇజ్రాయెల్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రాతి పాత్రలో స్టెమ్‌ కణాలను ఉపయోగించి ఈ పిండాన్ని అభివృద్ధి చేయడం విశేషం. గుడ్ల ఫలదీకరణ, వీర్యకణాల అవసరం లేకుండానే స్టెమ్‌ సెల్స్‌ సాయంతో ఈ కృత్రిమ పిండాన్ని తయారు చేశామని, ఎలుకల పిండాలను నమూనాగా తీసుకొని వీటిని వృద్ధి చేసినట్టు పరిశోధకులు తెలిపారు. సంతాన సమస్యలతో బాధపడే దంపతులకు తమ ఆవిష్కరణ కొత్త ఆశలను చిగురింపజేయగలదని, దీనిపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు.

 

Tags :