చిన్నమ్మకు మరో భారీ షాక్

చిన్నమ్మకు  మరో భారీ షాక్

అన్నాడీఎంకే బహిష్కృత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు మరో భారీ షాక్‍ తగిలింది. ఆమెకు సంబంధించిన వంద కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది. బినామీ లావాదేవీల చట్టం కింద ఆమెకు సంబంధించిన 11 ఆస్తిపాస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై శివారులోని పయ్యనూర్‍లో ఉన్న ఆస్తులను ఐటీ విభాగం సొంతం చేసుకుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య 24 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐటీ విభాగం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అప్పట్లో రూ.20 లక్షలు ఉండగా ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.100 కోట్లకు చేరింది. అవినీతి కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవించి ఈ ఏడాది ఆరంభంలో విడుదలయ్యారు. శశికళ మరణానంతరం అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అవినీతి కేసులో శిక్ష పడటంతో జైలుకెళ్లాల్సి వచ్చింది.

 

Tags :