లండన్ లో మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం

లండన్  లో మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం

యునైటెడ్‌ కింగ్‌డమ్‌, దావోస్‌ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ నుంచి లండన్‌ చేరుకున్న మంత్రి కే తారకరామారావుకి ఘన స్వాగతం లభించింది. లండన్‌ విమానాశ్రయం లో యూకేకి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్‌ఆర్‌ఐ సంఘాలు, ఇతర ప్రముఖులు మంత్రి కేటీఆర్‌ కి స్వాగతం పలికారు. యూకేలో నాలుగు రోజులపాటు పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో లండన్‌ విమానాశ్రయంలో కోలాహలం నెలకొంది. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో విమానాశ్రయానికి చేరుకుని కేటీఆర్‌ కి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్‌ తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ మంత్రి కేటీఆర్‌ కి లండన్‌ లో స్వాగతం పలికి, సాదరంగా స్వాగతించారు.

Click here for Photogallery

 

 

Tags :