ఏపీలో ఐటీశాఖ కలకలం... మంత్రి జయరాం భార్యకు

ఏపీలో ఐటీశాఖ కలకలం... మంత్రి జయరాం భార్యకు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఐటీశాఖ నోటీసులు కలకలం రేపాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం భార్య రేణుకకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణుక పేరుతో ఆస్పరి మండలం చిన్నహోతురు, ఆస్పరిలో 30.83 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన ఐటీశాఖ అక్టోబరు 30న మంత్రి జయరాం భార్య రేణుకకు నోటీసులు జారీ  చేసింది.   ఈ భూమి కొనుగోలు చేసేందుకు మంత్రి జయరాం డబ్బులు చెల్లించారని ఐటీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 30.83 ఎకరాల భూమికి రూ.52.42 లక్షలు చెల్లించారని, దీన్ని బినామీగా పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న 90 రోజుల్లో సమాదానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన భార్య రేణుకకు ఎలాంటి ఐటీ నోటీసులు అందలేదని మంత్రి తెలిపారు.  కొన్ని ఛానెళ్లు తనపై బురదజల్లే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. తమది  ఉమ్మడి కుటుంబమని అన్నారు. 1995లో తన తల్లి సర్పంచ్‌గా, 2006లో తాను జడ్పీటీసీగా పని చేశామన్నారు. 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని, 2014,  2019లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిని అయ్యానని తెలిపారు.

 

 

Tags :