మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లిన అధికారులు..

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లిన అధికారులు..

టీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డి ఇళ్లు సహా సన్నిహితులపై ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ దాడులు చేసింది. దాదాపు 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ఉదయం 5 గంటలకు మొదలైన ఈ సోదాలు ఇంకా సాగుతున్నాయి. మంత్రికి చెందిన 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాల్లోనూ ఐటీ సోదాలు చేస్తోంది. ఈ సోదాల్లో అధికారులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. కొంపల్లి బొబ్బిలి ఎవెన్యూలోని ఫ్లాట్ నెంబర్ 302లో ఉంటున్న సంతోష్ రెడ్డి నివాసంపై కూడా దాడులు చేశారు. అయితే ఫ్లాట్ తలుపులు తెరవకపోవడంతో దాదాపు మూడు గంటల పాటు అధికారులు వేచి చూశారు. అయినా ఎవరూ తెరవకపోవడంతో తాళాలు పగలగొట్టి సోదాలు చేశారు. తాళాలు పగలగొట్టే సమయంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉన్నాయి. మల్లారెడ్డికి సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలు సంతోష్ రెడ్డి చూసుకుంటున్నారు. ఈ దాడుల్లో సంతోష్ రెడ్డి ఇంట్లో అధికారులు రెండు ఎలక్ట్రానిక్ లాకర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  జీడిమెట్లలో ఉంటున్న సన్నిహితుడు రఘునాథ్ వద్ద నుంచి మరో రూ.2.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దూలపల్లి పల్లి రోడ్డులోని అశోక్ విల్లాలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ప్రవీణ్ రెడ్డి చూసుకుంటున్నారు. సుచిత్రాలో ఉంటున్న త్రిశూల్ రెడ్డి నివాసం నుంచి అధికారులు ఇప్పటికే దాదాపు రూ.2 కోట్లను సీజ్ చేశారు. అయితే ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో బయటకు వచ్చిన మల్లారెడ్డి అభిమానులకు, అనుచరులకు, మీడియాకు అభివాదం చేసి వెళ్లిపోయారు. 

 

Tags :
ii). Please add in the header part of the home page.