MKOne Telugu Times Youtube Channel

బ్యూటీఫుల్‌ టార్చర్‌, లుక్‌ ఇక్కడి దాకా తీసుకొచ్చాయి - రామ్‌చరణ్‌

బ్యూటీఫుల్‌ టార్చర్‌, లుక్‌ ఇక్కడి దాకా తీసుకొచ్చాయి - రామ్‌చరణ్‌

అందమైన టార్చర్‌, అద్భుతమైన లుక్‌ మమ్మల్ని ఇక్కడిదాకా కనిపించాయి అని అన్నారు రామ్‌చరణ్‌. రెడ్‌ కార్పెట్‌ డిజిటల్‌ ప్రీ షోలో మార్క్ మాల్కిన్‌కి ఇచ్చిన వెరైటీ ఇంటర్వ్యూలో చెప్పారు రామ్‌చరణ్‌. 

రామ్ చరణ్‌ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ఆయన అలాగే కనిపించారు. ఆయన లుక్‌ అద్భుతంగా అనిపించింది. వెరైటీ డిజిటల్‌ ప్రీ షోలో గ్రే కార్పెట్‌ మీద అద్భుతంగా కనిపించారు. ఎంత ఎదిగినా వినమ్రంగా ఉండటం రామ్‌చరణ్‌ నైజం. ఎస్‌.ఎస్‌.రాజమౌళితో పాటు గోల్డెన్‌ గ్లోబ్‌కి వెళ్లిన రామ్‌చరణ్‌ అక్కడ వెరైటీ మార్క్ మాల్కిన్‌తో మాట్లాడారు. తమను భారతదేశం నుంచి గ్లోబల్‌ స్పేస్‌కి నడిపించిన అద్భుతమైన విషయాలను పంచుకున్నారు.

వెరైటీ మార్క్ మాల్కిన్‌కి ఈ సినిమా మార్వెల్‌ మూవీని తలపించిందట. రామ్‌చరణ్‌ని చూస్తే మార్వెల్‌ యాక్టర్‌లాగా కనిపించారట. ఈ విషయాన్నే ఆయన చరణ్‌తో ప్రస్తావించారు. మార్వెల్‌ స్టార్‌గా, సూపర్‌హీరోగా చేయాలనుకుంటున్నారా? అని రామ్‌చరణ్‌ని ప్రశ్నించారు.  దానికి స్పందించిన రామ్‌చరణ్‌ ''తప్పకుండా. ఎందుకు చేయను'' అని అన్నారు. తన ఫేవరేట్‌ మార్వెల్‌ స్టార్‌ కెప్టెన్‌ అమెరికా అని అన్నారు. రామ్ చరణ్‌ మాట్లాడుతూ ''మా భారతదేశంలోనూ అద్భుతమైన సూపర్‌హీరోస్‌ ఉన్నారు. వాళ్లల్లో ఒకరిని మళ్లీ ఇక్కడికి పిలిపిస్తే బావుంటుందేమో'' అని అన్నారు.

నాటు నాటు పాట చిత్రీకరణలో, యాక్షన్‌ సీక్వెన్స్ లో ఎక్కువగా ఎవరు గాయపడ్డారు అనే ప్రశ్న ఎదురైంది రామ్‌చరణ్‌కి. దానికి స్పందించిన చరణ్‌ ''దాని గురించి మాట్లాడటానికి ఇప్పటికీ నా మోకాళ్లు వణుకుతున్నాయి. అయినా చేశాం. అలాగే చేశాం. అది అందమైన టార్చర్‌. ఆ కష్టం, ఆ విధానం, లుక్‌ మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాయి. ఇక్కడ అందరి ముందు నిలుచుని మాట్లాడగలుగుతున్నామని అంటే దానికి కారణం అదే.  ధన్యవాదాలు'' అని చెప్పారూ.

 

Tags :