ఇటలీ చరిత్రలోనే తొలిసారిగా... పీఎంగా అతివాద నేత

ఇటలీ చరిత్రలోనే తొలిసారిగా... పీఎంగా అతివాద నేత

ఇటలీ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానిగా ఫాసిస్టు నేత జార్జియా మెలొనీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి మెజారిటీ ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు అవిభాజ్య ఇటలీలో ముస్సోలినీ ప్రభుత్వం, జర్మనీలో నియంత హిట్లర్‌ ఆధ్వర్యంలో పాసిస్టు ప్రభుత్వం రాజ్యమేలాయి. మళ్లీ ఇన్నేళ్లకు యూరప్‌లో ఏర్పడబోయే తొలి పాసిస్టు ప్రభుత్వంగా మెలొనీ సర్కారు నిలవబోతోంది. ఈ ఎన్నికల్లో మెలొనీ నేతృత్వం లోని కూటమి సుమారు 44 శాతం ఓటు సాధించింది. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి సుమారు 26 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన సెనేట్‌లో ఈ కూటమికి సుమారు 114 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 104 మంది సభ్యులు ఉంటే చాలు. కాగా, మెలొనీ విజయం  పట్ల ఐరోపా వ్యాప్తంగా ఉన్న ఫాసిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.