ఇప్పటి వరకు 16 లక్షలకు పైగా వీసాల జారీ: అమెరికా కాన్సుల్ జనరల్

హైదరాబాద్ పైగా ప్యాలెస్‌లో కాన్సులేట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 14 సంవత్సరాల్లో 16 లక్షలకు పైగా వీసాలు జారీ చేసినట్లు ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పకటించించారు. పైగా ప్యాలెస్‌కు వీడ్కోలు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 42,511 మందికి పౌరసత్వ సేవలు అందించినట్లు వెల్లడిరచారు. నూతన ప్రాంగణంలో వీసా ఇంటర్వ్యూ కేంద్రాలను భారీగా ఏర్పాటు చేస్తున్నాం. వీసాల జారీ సంఖ్య రానున్న రోజుల్లో మరింత వేగవంతం చేస్తాం. నూతన ప్రాంగణంలో సిబ్బంది నూతనోత్సాహంతో సేవలు అందిస్తారు అని జెన్నిఫర్ పేర్కొన్నారు.
Tags :