ఫేస్బుక్ ఆఫర్.. 1.8 కోట్లతో భారీ ఫ్యాకేజీ

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బిడ్డకు భారీ ఫ్యాకేజీతో ఫేస్బుక్లో ఉద్యోగం దక్కింది. కోల్కతా జాదవ్పూర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఫైనలియర్ చదువుతున్న బిశాక్ మోండాల్కు హయ్యెస్ట్పే ప్యాకేజీతో జాబ్ దక్కింది. బిశాఖ్ సెప్టెంబర్లో లండన్లోని ఫేస్బుక్లో జాయిన్ కాబోతున్నాడు. కోటి 80 లక్షల రూపాయల ప్యాకేజ్. అయితే ఫేస్బుక్ కంటే ముందు అతనికి గూగుల్, అమెజాన్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. ప్యాకేజీ ఎక్కువగా ఉండడంతో ఫేస్బుక్ వైపు మొగ్గు చూపించినట్లు తెలిపాడు. అతనిది ఒక సాదాసీదా రైతు కుటుంబం. బీర్భూమ్లోని రామ్పూర్హాట్లో ఉంటోంది అతని కుటుంబం. తండ్రి రైతు కాగా, తల్లి అంగన్వాడీ వర్కర్. తమ బిడ్డను తమను గర్వపడేలా చేశాడని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. గతంలో కోటీ కంటే ఎక్కువ జీతంతో తొమ్మిది మంది జేయూ విద్యార్థులు ఈ ఘనత సాధించగా ఆ అందరికెల్లా హుయ్యెస్ట్ ప్యాకేజీ దక్కించుకుందని మాత్రం బిశాఖ్ కావడం గమనార్హం.