ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో దర్భార్‌ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను ప్రముఖులు అభినందించారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ అంతకుముందు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఆయనను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వా పై 346 ఓట్ల తేడాతో జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజయం సాధించారు.

 

Tags :