ప్రజా సమస్యలపై స్పందిస్తే.. అధికార దుర్వినియోగంతో

ప్రజా సమస్యలపై స్పందిస్తే అధికార దుర్వినియోగంతో మోదీ, అమిత్ షా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్ నిర్ణయం ప్రకారం ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా త్వరలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడతారని, రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఈడీ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయని అన్నారు. బీజేపీ నాయకులు జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని అడ్డు పెట్టుకొని రెండు నుంచి 47 స్థానాలు గెలుచుకున్నారని అన్నారు. దేశంలో రాముడిని అడ్డుపెట్టుకొని విజయం సాధించారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి పైసలు కావాలంటే పత్రికా డబ్బులు అవసరం లేదని, కార్యకర్తలు ఇస్తారని తెలిపారు.
Tags :