ఈ ఇద్దరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి : జగ్గారెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయని, నెల రోజులుగా లిక్కర్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు స్కాంలు కూడా నిజమని తేలిందన్నారు. కవిత లిక్కర్ కేసులో ఉందని, అరెస్టు చేస్తామని బీజేపీ ఇన్ డైరెక్టర్‌గా సిగ్నల్ ఇచ్చేసిందన్నారు. కవిత, బీఎల్ సంతోష్ ఇద్దరూ నేరగాళ్లే అని మండిపడ్డారు. కవితను, బీఎల్ సంతోష్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. తెలంగాణలో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్లు షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో సీఎం మీ అన్నే కదా అక్కడ సమస్యలు లేవా? ఏపీలో సమస్యలపై షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. త్వరలోనే షర్మిల ఫైనాన్స్ వ్యవహారాలన్నీ బయటపెడతా. తెలంగాణకు షర్మిల కోడలే తప్ప కూతురు కాదు అని తెలిపారు.
Tags :