మర్రి శశిధర్ పార్టీ మారితే వారిదే బాధ్యత: జగ్గారెడ్డి

మర్రి శశిధర్ పార్టీ మారితే వారిదే బాధ్యత: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పార్టీ పారేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే తాజాగా ఈ విషయంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఒకవేళ మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే రేవంత్, భట్టి విక్రమార్కలే బాధ్యత వహించాలని తెలిపారు. అంతేకాకుండా పార్టీకి ఎటువంటి నష్టం వచ్చినా మహేష్ గౌడ్‌ బాధ్యత వహించాలని చెప్పుకొచ్చారు. అయితే మునుగోడులో ఓటమిపై పీసీసీ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో పాల్గొనమంటూ ఆహ్వానం పంపండంపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ చేసేది పూర్తిగా తప్పని, జూమ్ మీటింగ్‌లు పెట్టడం సరైన పని కాదని జగ్గారెడ్డి అన్నారు. మనం ఉన్నది ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని, సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నవారిలో ఇంట్లో కూర్చుని సమావేశంలో నిర్వహించుకోవడం సరికాదని అన్నారు. ఇప్పటివరకు మునుగోడులో జరిగిన పరాభవంపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. పార్టీలోని ప్రతిఒక్కరూ గాంధీభవన్‌లో సమావేశమయ్యేలా పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని, పార్టీలో ఇబ్బందికర వాతావరణం ఉన్నది నిజమేనని, అందులో తనకూ బాధ్యత ఉందని, చాలా సరిదిద్దుకోవాల్సి ఉందని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో సమన్వయం కరువైందని, దాని దృష్టి పెట్టకపోవడం పీసీసీ తప్పని, రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తోందని ఆయన ఆరోపించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.