జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నవంబర్ లేదా డిసెంబర్ లో

జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నవంబర్ లేదా డిసెంబర్ లో

ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌ మాసాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి 2023లో ముందస్తు ఎన్నికలకు పోతుందని, అధికారంలో ఉన్నారు కనుక ఏమైనా చేస్తారంటూ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోని మీడియా హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నిలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌కు 50 నుంచి 60 స్థానాల్లో గెలిచే బలమైన నాయకులు ఉన్నారని అన్నారు. బీజేపీకి నియోజకవర్గ స్థాయిలో గెలిచే నాయకులు లేరని, ఎన్నికల్లో 20 సీట్లు కూడా గెలిచే స్థాయి లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ రాజకీయ వేడిని సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎన్నికల కమిషన్‌కు రెండు రోజుల్లో లేఖను రాయనున్నట్టు తెలిపారు.

 

Tags :